గడ్కరీ చెప్పిన విషయానికి చంద్రబాబు ఆశ్చర్యపోయారు: ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)రైస్ నుంచి తారు విటమిన్ తయారుకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా చెబితే సీఎం చంద్రబాబు ఆశ్చర్య వ్యక్తం చేశారని రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్(State BJP chief Madhav) తెలిపారు. అంతేకాదు
గడ్కరీ చెప్పిన విషయానికి చంద్రబాబు ఆశ్చర్యపోయారు: ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు


అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)రైస్ నుంచి తారు విటమిన్ తయారుకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా చెబితే సీఎం చంద్రబాబు ఆశ్చర్య వ్యక్తం చేశారని రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్(State BJP chief Madhav) తెలిపారు. అంతేకాదు ఆ దిశగా ఆలోచన చేస్తామని చంద్రబాబు చెప్పారని ఆయన గుర్తు చేశారు. పామాయిల్, కోకో, కొబ్బరి రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఏలూరు నిమ్మ మార్కెట్‌కి ప్రసిద్ధి అని, అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమలకు కేంద్రం సహాకారం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రొఫెషనల్ కోర్సులు చేసిన యువత నిరుద్యోగులుగా మారడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. అందుకే కేంద్రం స్కిల్ యూనివర్సిటీలను తీసుకుని వచ్చిందన్నారు.

ప్రధానమంత్రి కౌశల్య యోజన(Prime Minister's Skill Development Scheme) పేరుతో 18 వృత్తులు కు శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన(Prime Minister Vishwakarma Yojana) పథకం ద్వారా యువతకు అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇందు కోసం విశాఖ(Visakha)లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమైందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande