చండీగఢ్:/న్యూఢిల్లీ, 3 సెప్టెంబర్ (హి.స.) పంజాబ్‌లో సట్లెజ్, బియాస్, రావి నదులతో పాటు చిన్నచిన్న వాగులూ వంకలూ పొంగి ప్రవహిస్తుండటంతో 12 జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 1988 తర్వాత సంభవించిన అతిదారుణ వరదలు ఇవేనని అధికారులు అంటున్నారు. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో కుండపోత కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. గురుదాస్‌పుర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, కపూర్థలా, తరన్‌తారన్, ఫిరోజ్‌పుర్, హోశియార్‌పుర్, అమృత్‌సర్ జిల్లాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. చైనా పర్యటన నుంచి తిరిగివచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ఫోన్‌చేసి పరిస్థితి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ‘జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం’ (ఎన్‌డీఆర్‌ఎఫ్), సైన్యం, సరిహద్దు భద్రతాదళం పాల్గొంటున్నాయి. విద్యా సంస్థలకు బుధవారం వరకూ సెలవు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ