తాడిపత్రి వెళ్లనున్న కేతిరెడ్డి.. డేట్ ఫిక్స్..!
అనంతపురం, 3 సెప్టెంబర్ (హి.స.)అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former Tadipatri MLA Kethireddy Pedda Reddy) ఎట్టకేలకు తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Pr
తాడిపత్రి వెళ్లనున్న కేతిరెడ్డి.. డేట్ ఫిక్స్..!


అనంతపురం, 3 సెప్టెంబర్ (హి.స.)అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former Tadipatri MLA Kethireddy Pedda Reddy) ఎట్టకేలకు తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డిగా రాజకీయం నడిచింది. అయితే ఈ మధ్య పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. తనను తాడిపత్రికి రానివ్వడంలేదని పెద్దారెడ్డి.. వస్తే భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పే పరిస్థితికి వచ్చింది. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్లి తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు తేదీని ప్రకటించారు. ఈ నెల 5 తర్వాత తాడిపత్రికి వెళ్లనున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు అనుమతి మేరకు స్థానిక ఎస్పీ సూచనలతో తాడిపత్రికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande