అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)వాయవ్య బంగాళాఖాతం(Bay of Bengal)లో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ అల్పపీడనం(Low Pressure) మరింత బలపడి ఒడిశా(Odisha) దగ్గర తీరం దాటే అవకాశ ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officials) తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాకు అధికారులు భారీ వర్ష సూచన చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు జిల్లాలో మోస్తరు వానలు పడతాయని పేర్కొన్నారు.
అల్పపీడన ప్రభావంతో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి