అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)మూడేళ్లలో అమరావతి(Amaravati)ని రెడీ చేస్తామని మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు. గుంటూరు(Guntur)లో పర్యటించిన ఆయన.. అమరావతి చాలా సేఫ్ సిటీ అని తెలిపారు. అమరావతి నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రతి రోజూ డెవలప్‌మెంట్ పనులు జరుగుతున్నాయని, ఆ విషయం వచ్చి చూస్తూ తెలుస్తుందన్నారు. రాజధానిపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని గ్రాఫిక్స్ ప్రజలు క్షమించరని నారాయణ హెచ్చరించారు.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధానిపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమరావతి నిర్మాణ పనులను శరవేగంగా చేస్తోంది. ఇప్పటికే పలు బిల్డింగులు పూర్తి దశకు చేరుకున్నాయి. మరి కొన్ని నిర్మాణం దశలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రాజధానికి ఓ రూపు ఏర్పడుతోంది. ఈ సమయంలో కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి నారాయణ స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి