నెల్లూరు, 3 సెప్టెంబర్ (హి.స.)లేడీ డాన్ అరుణ(Lady Don Aruna)పై మరో కేసు నమోదు అయింది. అన్నదమ్ముల ఆస్తి(Property of brothers and sisters) వివాదంలో గన్‌తో బెదిరించారని శశికుమార్ అనే వ్యక్తి నెల్లూరు నవాబుపేట(Navabpet) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అరుణపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో అరుణ రిమాండ్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆమె జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అరుణపై మరో కేసు నమోదు అయింది.
నెల్లూరు జిల్లా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీ షీటర్, తన ప్రియుడు శ్రీకాంత్ కోసం అరుణ పెరోల్ తీసుకురావడంతో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ తో కలిసి అరుణ మూడు జిల్లాల్లో దందాలు నడిపినట్లు తేలడంతో ఆమె పలు చోట్ల ఫిర్యాదు అందాయి. దీంతో అరుణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి