దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములు.. మంత్రి నారా లోకేశ్​
అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిది అని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్​మాట
దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములు.. మంత్రి నారా లోకేశ్​


అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిది అని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్​మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, దక్షిణాదిలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని అన్నారు. ఆ ఆయన ఆమరణ నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే పెను మా ర్పులు వచ్చాయన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే.. పొట్టి శ్రీరాములు తెలుగుజాతి కోసం ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు. గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ అయితే.. పొట్టి శ్రీరాములు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ స్టేట్స్ అని పిలుస్తారని తెలిపారు. కొన్ని దీపాలు వెలుతురిని ఇస్తాయి.. మరికొన్ని దీపాలు దారిని చూపిస్తాయని లోకేష్ అన్నారు. ప్రాణత్యాగం చేసి కోట్లాది మందికి దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. 58 రోజులపాటు ఆయన చేసిన దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని అమరావతి రాజధానులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దళితులను గుడిలోకి ప్రవేశించాలని పొట్టి శ్రీరాములు పోరాడారని గుర్తు చేశారు.

పొట్టి శ్రీరాములు వంటి వ్యక్తి పదిమంది ఉంటే భారతదేశానికి స్వాతంత్రం ఒక్క ఏడాదిలో వస్తుందని ఆనాడు గాంధీ చెప్పారని అన్నారు. ఆయన జీవితం నుంచి చాలా నేర్చుకోవాలని పేర్కొన్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆయన పోరాడే అని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande