టియాంజిన్ డిక్లరేషన్‌ అర్ధంలేనిదన్న పి చిదంబరం
న్యూఢిల్లీ, 3 సెప్టెంబర్ (హి.స.) చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) టియాంజిన్ ప్రకటనను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పి చిదంబరం విమర్శించారు. దీనిని ''చెత్త'' అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన తన X ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రపంచదేశాలు ఉగ్రవాద కారక, బ
THREE LEADERS


న్యూఢిల్లీ, 3 సెప్టెంబర్ (హి.స.) చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) టియాంజిన్ ప్రకటనను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పి చిదంబరం విమర్శించారు. దీనిని 'చెత్త' అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన తన X ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రపంచదేశాలు ఉగ్రవాద కారక, బాధిత దేశాల మధ్య తేడాను చూపించవని పాకిస్తాన్ సంతకం నిరూపిస్తుందని చిదంబరం అన్నారు.

'టియాంజిన్ డిక్లరేషన్ ఉగ్రవాదాన్ని, దాని అన్ని రూపాల్ని తీవ్రంగా ఖండించింది. దానిపై పాకిస్తాన్ సంతకం చేసి ఆమోదించింది. అది ఆ ప్రకటన విలువను చూపిస్తుంది' అని చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాలు ఉగ్రవాద కారక, బాధిత దేశాల మధ్య తేడాను గుర్తించలేకపోతే, ఇటువంటి అర్థరహిత ప్రకటనలపై సంతకం చేసి ఆమోదించబడతాయంటూ ఆయన విమర్శించారు.

చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ దేశాధినేతల 25వ సమావేశంలో మన ప్రధాని మోదీ ప్రసంగించారు. SCO ద్వారా పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంలో భారతదేశ విధానాన్ని ప్రధానమంత్రి తెలియజెప్పారు. దేశ భద్రత, కనెక్టివిటీ, అవకాశం అనే మూడు స్తంభాల కింద మరింత మెరుగైన చర్య తీసుకోవాలని ప్రధాని సభ్యదేశాల్ని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande