లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. చెవిరెడ్డి ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు
చిత్తూరు, 3 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర లిక్కర్ కేసు(Liquor Case)లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. వైసీపీ నేత చెవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి(Ycp Leader Chevireddy Bhaskar Reddy), ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి(Mohith Reddy)కి చెందిన ఇన్ ఫ్రా కంపెనీ(Infra
లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. చెవిరెడ్డి ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు


చిత్తూరు, 3 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర లిక్కర్ కేసు(Liquor Case)లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. వైసీపీ నేత చెవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి(Ycp Leader Chevireddy Bhaskar Reddy), ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి(Mohith Reddy)కి చెందిన ఇన్ ఫ్రా కంపెనీ(Infra Companay)ల్లో సోదాలు నిర్వహించారు. అధికారులు చిత్తూరు(Chittoor) వెళ్లి ఆయా కంపెనీల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. మద్యం ముడుపులను కంపెనీల్లోకి మళ్లించినట్లుగా అధికారులకు సమాచారం అందడంతో ఈ సోదాలు చేపట్టారు. దీంతో ఆయా కంపెనీల్లో అధికారుల తనిఖీలు ఒక్కసారిగా కలకలం రేపాయి. సమాచారం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ శ్రేణులు ఆయా కంపెనీల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. సిట్ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. సిట్ ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. సోదాల తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande