నారా లోకేశ్ తో నేడు భేటీ కానున్న వంగవీటి రాధా.. హైదరాబాద్ నుంచి విజయవాడకు పయనం
అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. మంత్రి నారా లోకేశ్, ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ (రాధా) ఈరోజు సమావేశం అవుతున్నారు. సుమారు 11 నెలల విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అవుతుండటంతో, ఈ సమావేశం వెనుక ఉన్
/vangaveeti-radha-to-meet-nara-lokesh-today


అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. మంత్రి నారా లోకేశ్, ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ (రాధా) ఈరోజు సమావేశం అవుతున్నారు. సుమారు 11 నెలల విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అవుతుండటంతో, ఈ సమావేశం వెనుక ఉన్న అజెండా ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

నారా లోకేశ్ కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు వంగవీటి రాధా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వంగవీటి రాధా, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తనకు టికెట్ కేటాయించకపోయినా, రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించి కూటమికి మద్దతుగా నిలిచారు.

అయితే, ఎన్నికలు ముగిసి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వంగవీటి రాధాకు ఎలాంటి పదవి లభించకపోవడంపై ఆయన అనుచరుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవి లేదా మరో కీలక నామినేటెడ్ పదవిని వారు ఆశించారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న తాజా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ భేటీలో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై నారా లోకేశ్ నుంచి స్పష్టమైన హామీ లభించవచ్చని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande