విజయవాడలో వర్షం కారణంగా భక్తులు.అమ్మవారి దర్శనానికి ఇబ్బంది
అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.) విజయవాడ: వర్షం కారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఉచిత దర్శనం క్యూ లైన్‌లో వస్తున్న భక్తులు వానలో తడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంక
విజయవాడలో వర్షం కారణంగా భక్తులు.అమ్మవారి దర్శనానికి ఇబ్బంది


అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)

విజయవాడ: వర్షం కారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఉచిత దర్శనం క్యూ లైన్‌లో వస్తున్న భక్తులు వానలో తడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దుర్గాష్టమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. వర్షం వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande