తెలంగాణ, భద్రాచలం. 30 సెప్టెంబర్ (హి.స.)
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ఉన్న ప్రవహిస్తుంది. సోమవారం రాత్రి 8 గంటలకు 46 అడుగులు గోదావరి, మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు 48 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఎగువన ఉన్న సరస్వతి బ్యారేజ్ 66 గేట్లు ఓపెన్ చేసి 7,91,444 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అలాగే మేడిగడ్డ ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తి 11,37,540 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 6 గంటలకు 48.50 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది. ఇప్పటికే భద్రాచలం నుండి దుమ్ముగూడెం వెళ్లే ప్రధాన రహదారి తూరుబాక వద్ద గోదావరి ప్రవహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు