అబద్దాలతో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు అని ఆయన మండి
శ్రీనివాస గౌడ్


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

ప్రజలను కొన్ని సార్లు మోసం చేయవచ్చు.. అన్ని సార్లు మోసం చేయలేరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అదే మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. రిజర్వేషన్ల పెంపుపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు జీవో తెచ్చారు.. ఆరునెలల లోపే రిజర్వేషన్లు పెంచుతామన్నారు.. అపుడే ఎందుకు జీవో తేలేదు. జీవోతోనే పని అయ్యేదుంటే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఎందుకు, బిల్లు గవర్నర్, రాష్ట్రపతి దగ్గరకు ఎందుకు..? జీవో తెచ్చినట్టే తెచ్చి కోర్టులో కేసులు వేయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande