బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.) రచయిత, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ ఘంటా చక్రపా
గోరటి వెంకన్న


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

రచయిత, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. సాహిత్య విభాగంలో గోరేటి వెంకన్న చేస్తున్న సేవను గుర్తించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande