గ్యారెంటీలకు టాటా. లంకె బిందెలకు వేట.. సీఎం రేవంత్ రెడ్డి పై హరీశ్రావు కామెంట్స్..
తెలంగాణ, సిద్దిపేట. 30 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంకె బిందెలకు వేటపట్టిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సెటైర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్
హరీష్ రావు


తెలంగాణ, సిద్దిపేట. 30 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంకె బిందెలకు వేటపట్టిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సెటైర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీశ్రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారు. రేపు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపిణీ చేయాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande