ఢిల్లీలో భారీ వర్షాలు.. విమానాల రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.జఖీరా అండర్పాస్ కింద భా
ఢిల్లీ వర్షాలు


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.జఖీరా అండర్పాస్ కింద భారీగా వరదనీరు చేరింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది.

ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా లాంటి పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు చేస్తున్నాయి. వర్షాల కారణంగా విమాన సర్వీసుల షెడ్యూళ్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, కాబట్టి ప్రయాణికులు ఎయిర్పోర్టులకు బయలుదేరే ముందే ఫ్లైట్ షెడ్యూల్ను చెక్ చేసుకుని రావాలని సలహా ఇస్తున్నారు. వాతవరణ పరిస్థితులను బట్టి కొన్ని ఫ్లైట్ సర్వీసులు రద్దు కూడా కావచ్చని ప్రయాణికులు ఇది గమనించాలని ఎయిర్లైన్స్ హెచ్చరికలు చేస్తున్నాయి.

దాంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande