జోగులాంబకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
తెలంగాణ, జోగులాంబ గద్వాల. 30 సెప్టెంబర్ (హి.స.) తుంగభద్ర తీరాన వెలసిన ఐదవ శక్తిపీఠమైన జోగులాంబకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అధికా
జోగులాంబ


తెలంగాణ, జోగులాంబ గద్వాల. 30 సెప్టెంబర్ (హి.స.)

తుంగభద్ర తీరాన వెలసిన

ఐదవ శక్తిపీఠమైన జోగులాంబకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అధికారికంగా కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు తీసుకువచ్చిన కలెక్టర్కు ఈఓ ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయం చేరుకొని పట్టు వస్త్రాలు అందజేసి అమ్మవారికి పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande