హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.) దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల
సందర్భంగా జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు కేటీఆర్ దంపతులు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..