విశాఖపట్నం, 30 సెప్టెంబర్ (హి.స.)
నగరంలోని ఓల్డ్ టౌన్ పరిధి కురుపాం మార్కెట్ ప్రాంతంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 148 ఏళ్ల పురాతన కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణలో తీర్చిదిద్దారు. 7 కేజీల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు.. 12 కేజీల వెండి, రూ.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అద్భుతంగా అలంకరించారు. ఆలయంలో 250 మంది మహిళలతో కోటి కుంకుమార్చన నిర్వహించినట్లు దేవస్థాన సంఘం అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్, కార్యదర్శి పెనుగొండ కామరాజు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ