ముంబై,దిల్లీ: 30 సెప్టెంబర్ (హి.స.) రోడ్డుపై ముగ్గు వేసి ‘ఐ లవ్ మహమ్మద్’ అనే నినాదాన్ని రాయడంతో మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగి ఆందోళనలకు దారి తీసింది. నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి.. 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. దేవీ నవరాత్రుల నేపథ్యంలో ఆదివారం రాత్రి అహల్యానగర్ (గతంలో అహ్మద్‌నగర్) మిల్లివాడ ప్రాంతంలో రోడ్డుపై ముగ్గుతో పాటు ‘ఐ లవ్ మహమ్మద్’ అనే నినాదాన్ని ఎవరో రాశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్థానికులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అందుకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతడి సామాజిక వర్గానికి చెందిన యువకులు నిరసన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకొని శాంతింపజేసేందుకు యత్నించగా.. వారిపైకే రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి.. 30 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ