తెలంగాణ, నిజామాబాద్. 30 సెప్టెంబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేలా అధికారులు సన్నద్ధం కావాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం ఎంపీడీఓ లు, ఎంపీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు.
రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లను, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు