హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా
వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్గా ఉన్న సీవీ ఆనంద్ నుంచి మంగళవారం వారు బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ స్థానంలో ఇప్పటికే వై. నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీకి నాలుగేళ్లు సంతృప్తినిచ్చిందని, సమష్టికృషితో సంస్థలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామని. సోమవారం సజ్జనార్కు ఆర్టీసీ సంస్థ అధికారులు, సిబ్బంది వీడ్కోలు సభ నిర్వహించారు. సజ్జనార్ వీడ్కోలు తీసుకున్న సందర్భంగా 'ఎక్స్'లో ఆసక్తికర పోస్ట్ చేశారు. 'నా స్టాప్ వచ్చేసింది. బస్సు దిగి, కొత్త మార్గంలో పయనించాల్సిన ఆసన్నమైంది. ప్రయాణాలు ఆగుతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు. కానీ రహదారి ఎళ్లప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది' అని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు