హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్
వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వారు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సీపీ గా తనకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. తనకున్న అనుభవంతో విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తా అని అన్నారు. టీం వర్కు్కు మారుపేరు హైదరాబాద్ కమిషనరేట్ .. హైదరాబాద్ పోలీసులు సెన్సేషనల్ కేసులు చేధించారు.. సీపీగా కొత్త సంస్కరణలలు తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతీ సిటిజన్ ఒక పోలీస్ ఆఫీసర్.. పౌరులకు సామాజిక బాధ్యతతో ప్రవర్తించాలని సూచించారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసుకు తెలంగాణ పోలీసులు మారుపేరు.. పీపుల్ వెల్ఫేర్ పోలీసుగా తయారు చేస్తామని కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఉంది.. పీపుల్ వెల్ఫేర్ పోలీస్ కాన్సెప్ట్ ముందుకు వెళ్తామని అన్నారు. దాంతో పాటు నగరంలో మరో పెద్ద సమస్య డ్రగ్స్.. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం.. ఈగల్ టీంను కూడా మరింత బలోపేతం చేస్తాం.. ప్రభుత్వం కూడా డ్రగ్స్పై సీరియస్గా ఉందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ పోలీసులు టాప్ ప్రయారిటీ డ్రగ్స్ నివారణే. దాంతో పాటు సైబర్ నేరాలపై కూడా దృష్టి పెడతాం. వృద్ధులు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ లాంటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుల అత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారికి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తాం. ఇక నుంచి బెట్టింగ్ యాప్స్పై కూడా ఫోకస్ ఉంటుంది.. ఎవరూ బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహించొద్దు. కల్తీ ఆహారం, కల్తీ కల్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా అందరిపై నిఘా పెడతామనిఅన్నారు.
ఆడపిల్లలు.. చిన్న పిల్లలపై నేరాలకు పాల్పడితే ఊరికోము.. ఇక నుంచి చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆడపిల్ల జోలికి వెళ్ళేటపుడు ఇంట్లో తల్లి పిల్లను గుర్తు తెచ్చుకోవాలి.. అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం.. ప్రజల వెంట హైదరాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు... ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను.. అని సజ్జనార్ భరోసా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్పై కూడా రివ్యూ చేస్తాం.. అనంతరం తదుపరి చర్యలపై ఆలోచిస్తామని అన్నారు. రౌడీ షీటర్ లు జాగ్రత్తగా ఉండాలని మరోసారి హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..