కర్నూలు, 30 సెప్టెంబర్ (హి.స.)
: పత్తికొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తుగ్గలి మండలం ముకెల గ్రామానికి చెందిన భూమిక (26), నితిక (5) తల్లీకూతుళ్లు. వారిద్దరూ శిరీష (30)తో కలిసి పండుగ సరుకుల కోసం పత్తికొండకు వచ్చారు. పండుగ, సరుకులు తీసుకుని తమ గ్రామమైన ముక్కెళ్ల గ్రామానికి వెళ్లడానికి ఆటోలో బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో బియ్యం లోడుతో లారీ బ్రేకులు ఫెయిలై ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు