తెలంగాణ, పెద్దపల్లి. 30 సెప్టెంబర్ (హి.స.)
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సుద్దాల వద్ద రైండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను సుల్తానాబాద్కు చెందిన అభి, రాకేశ్ గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు