ఇడ్లీ.. ఓ మేఘం. ఓ తీయని కల.. అదొక కళాత్మక అద్భుతం -కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌
తిరువనంతపురం /దిల్లీ: 30 సెప్టెంబర్ (హి.స.)కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor)కి ఫుడ్‌ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఇడ్లీ గురించి కవితాత్వకంగా పోస్ట్‌ చేసిన మరుసటిరోజే.. వేడివేడిగా ఆయనకు ఆ
Sasi tharoor


తిరువనంతపురం /దిల్లీ: 30 సెప్టెంబర్ (హి.స.)కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor)కి ఫుడ్‌ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఇడ్లీ గురించి కవితాత్వకంగా పోస్ట్‌ చేసిన మరుసటిరోజే.. వేడివేడిగా ఆయనకు ఆ బ్రేక్‌ఫాస్ట్‌ను అందించింది. ఊహించని ఈ పరిణామంతో ఆయన అవాక్కై.. ఆపై తేరుకుని ఆనందం వ్యక్తం చేశారు.

శశి థరూర్‌ గారికి ఈ ప్రాంతంలోని ఉత్తమమైన ఇడ్లీలు అందించగలిగిన అవకాశం కలిగినందుకు మాకు అత్యంత ఆనందంగా ఉంది. రుచికరమైన ఆయన అభిరుచిని ఇవి తృప్తిపరిచాయని ఆశిస్తున్నాం అని స్విగ్గీ(Swiggy) తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా ఇడ్లీపై పోస్ట్‌కి స్పందనగా స్విగ్గీ ఇడ్లీలు పంపించి ఆశ్చర్యపరిచింది! ధన్యవాదాలు అంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా స్విగ్గీ సిబ్బందితో ఆయన దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. /

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande