హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)
బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ముస్తాబైంది. సద్దుల బతుకమ్మ కోసం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వేలాది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకోనున్నారు. ఈ వేడుకలకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరుకానున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్పై గ్రాండ్ ప్లోరల్ పరేడ్, హుస్సేన్ సాగర్లో తేలియాడే బతుకమ్మలు, సెక్రటేరియట్ పై 3డీ మ్యాప్ లేజర్ షోను నిర్వహించనున్నారు. అమర జ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..