హైదరాబాద్ , 4 సెప్టెంబర్ (హి.స.)రేపల్లె-వికారాబాద్)మార్గంలో నడిచే డెల్టా ఎక్స్‌ప్రెస్ (17626) వేళలు నవంబరు 4నుంచి మారనున్నాయి. ప్రస్తుతం రేపల్లె నుంచి ప్రతిరోజూ రాత్రి 10.40గంటలకు బయల్దేరి సికింద్రాబాద్)కు తర్వాతి రోజు ఉదయం 7.20గంటలకు చేరుకుంటోంది. కాగా, నవంబరు 4నుంచి వేళల్లో మార్పు కారణంగా ఈ రైలు సికింద్రాబాద్‌కు 45 నిమిషాలు ముందే(ఉదయం 6.35గంటలకు) రానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ