విశాఖపట్నం, 4 సెప్టెంబర్ (హి.స.)
అధిక వడ్డీ ఆశ చూపి విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని ఫెయిర్ గ్రో ట్రేడర్స్ అనే సంస్థ భారీ మోసానికి పాల్పడింది. పదుల సంఖ్యలో ఉన్న బాధితులకు సుమారు రూ. 6 కోట్ల వరకు టోకరా వేసింది. దీనిపై రోహిత్ అనే బాధితుడి ఫిర్యాదుతో ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే పది శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తామని సంస్థ నిర్వాహకులైన వెంకట్ కిశోర్, అతడి కుమారుడు నందన్, భార్య రామనాంబ నమ్మించారు. దీంతో బీచ్ రోడ్డు ప్రాంతంలో ఉంటున్న అర్జి రోహిత్ రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే అతడికి వడ్డీ ఇవ్వలేదు. రోహిత్ ఒత్తిడితో జూలైలో రూ. 50 లక్షలకు నాలుగు చెక్కులు ఇవ్వగా, అందులో ఒకటి బౌన్స్ అయింది. దాని గురించి ప్రశ్నిస్తే కిశోర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో రోహిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో కనీసం యాభై మంది నుంచి రూ.6కోట్ల వరకూ కిశోర్ వసూలు చేసినట్టు తెలుస్తోందని సీఐ జె.మురళి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ