ముంబై, 4 సెప్టెంబర్ (హి.స.)ప్రపంచ మార్కెట్లో ప్రతి రోజు రకరకాల స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో, అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యంతో గల ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే ఎక్కువ ఫీచర్స్ ఉండే ఫోన్‌లు విడుదల అవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ POVA స్లిమ్ 5G. ఈ ఫోన్ సెప్టెంబర్ 4న భారతదేశంలో లాంచ్ కానుంది. లీక్‌ల ప్రకారం.. TECNO నుండి రాబోయే స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది.
అంతేకాకుండా POVA స్లిమ్ 5G 13MP ఫ్రంట్-ఫేసింగ్, 50MP ప్రధాన కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు. బ్యాటరీ 5,160mAh యూనిట్ అని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది వైర్‌తో 45W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను అందిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి