అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో నేడు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
సముద్రంలో అలజడి రేగిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం, మణ్యం, ఏలూరు, విజయనగరం తదితర ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి