అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదితమే. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు తొలిసారిగా ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగలేదని వైసీపీ ఆరోపిస్తోంది.
అయితే పులివెందులలో ఎన్నికలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే, అందరూ కష్టపడితే జగన్ గెలిచే ప్రసక్తి ఉండదని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి