విజయవాడ, 4 సెప్టెంబర్ (హి.స.)విజయవాడ బెంగళూరు ఎయిరిండియా విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. విజయవాడలో టేకాఫ్అవుతుండగా విమాన రెక్కలను పక్షి ఢీకొంది. దీంతో అప్రమత్తమైన పైలట్సురక్షితంగా విమానాన్ని రన్‌వే మీదకు దించాడు. ప్రయాణికులందరినీ విమానం నుంచి దింపి లాంజ్‌లోకి సిబ్బంది తరలించారు. విమాన పరిస్థితిని పరిశీలించాక మళ్లీ ప్రయాణంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఉదయం 8.25 గంటలకు ఎయిరిండియా విమాని బయలు దేరాల్సి ఉంది. విమాన రెక్కలు దెబ్బతిన్నట్లు సమాచారం. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి