హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? పసిడి రేట్లు మరింత పెరగనున్నాయా?
ముంబై, 6 సెప్టెంబర్ (హి.స.) దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గినట్లే తగ్గి తులం ధర లక్షా 10వేల రూపాయలకు చేరువలో ఉంది. బంగారం ధరలు రోజురోజుకు రికార్డు సృస్తున్నాయి. దీనికి కారణంగా డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలు, ట్
Gold


ముంబై, 6 సెప్టెంబర్ (హి.స.) దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గినట్లే తగ్గి తులం ధర లక్షా 10వేల రూపాయలకు చేరువలో ఉంది. బంగారం ధరలు రోజురోజుకు రికార్డు సృస్తున్నాయి. దీనికి కారణంగా డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలు, ట్రంప్ టారిఫ్ లు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,780 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,810 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660 ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660 ఉంది.

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande