ముంబయి,07 సెప్టెంబర్ (హి.స.) : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలపై వ్యాపారులతో సహా ప్రజలందరిలో అవగాహన పెంపొందించేందుకు భాజపా దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం చేపట్టనుంది. ప్రమాదకర వస్తువులు, విలాస వస్తువులు మినహాయించి మిగతా వస్తు సేవలన్నిటినీ 5 శాతం, 18 శాతం శ్లాబుల కిందికి చేర్చాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ‘‘జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి భాజపా ఒక పూర్తి కార్యాచరణను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల్ని గురించి సామాన్యుల్లో అవగాహన పెంపొందించాల్సిందిగా మా పార్టీ రాష్ట్ర, జిల్లా విభాగాలను కోరాం’’ అని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బాలుని శనివారం వెల్లడించారు. ఇందులో భాగంగా ‘ప్రతి జిల్లాల్లో వీధి సమావేశాలు నిర్వహించనున్నాం’’ అని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ