మహారాష్ట్ర వినాయక నిమజ్జనాల్లో విషాదం.. నీటిలో పడి మొత్తం 17 మంది గల్లంతు
పూణే 7 సెప్టెంబర్ (హి.స.) మహారాష్ట్రలో జరిగిన వినాయక నిమజ్జనాల్లో భాగంగా పూణే జిల్లాలోని చకన్ ప్రాంతంలో, మూడు వేర్వేరు సంఘటనలలో నలుగురు వ్యక్తులు నీటిలో పడి కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. వాకీ ఖుర్ద్ వద్ద భామా నదిలో ఇద్దరు వ్యక్తులు, షెల్ పిం
మహారాష్ట్ర వినాయక


పూణే 7 సెప్టెంబర్ (హి.స.)

మహారాష్ట్రలో జరిగిన వినాయక

నిమజ్జనాల్లో భాగంగా పూణే జిల్లాలోని చకన్ ప్రాంతంలో, మూడు వేర్వేరు సంఘటనలలో నలుగురు వ్యక్తులు నీటిలో పడి కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. వాకీ ఖుర్ద్ వద్ద భామా నదిలో ఇద్దరు వ్యక్తులు, షెల్ పింపాల్గావ్ వద్ద మరొకరు గల్లంతయ్యారు.పూణే గ్రామీణ ప్రాంతంలోని బిర్వాడి వద్ద మరొక వ్యక్తి బావిలో జారిపడ్డి ప్రాణాలు కోల్పోయాడు. నలుగురిలో ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అలాగే నాందేడ్ జిల్లాలోని గడేగావ్ వద్ద నదిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని రక్షించగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే నాసిక్ లో నలుగురు నీటిలో మునిగిపోగా.. ఒకరి మృతదేహాన్ని సిన్నార్లో కనుగొన్నారు. జల్గావ్లో వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతవ్వగా వారి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.థానే జిల్లాలో విగ్రహ నిమజ్జనం సందర్భంగా ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారని, ఇప్పటివరకు వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశామని వారు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande