ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ ఎంపీలకు మాక్ పోలింగ్.. పాల్గొన్న ఈటెల..
న్యూఢిల్లీ, 7 సెప్టెంబర్ (హి.స.) ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్నిక విధానంపై బీజేపీ ఎంపీలకు వర్క్ షాప్, మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఇది కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియ
మాక్ పోలింగ్


న్యూఢిల్లీ, 7 సెప్టెంబర్ (హి.స.)

ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్నిక విధానంపై బీజేపీ ఎంపీలకు వర్క్ షాప్, మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఇది కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బీజేపీ ఎంపీలకు జరుగుతున్న వర్క్ షాప్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఎల్లుండి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇండియా కూటమి ఎంపీలకు రేపు మాక్ పోల్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande