గుంతకల్లు,, 7 సెప్టెంబర్ (హి.స.)
: గుంతకల్లుకు చెందిన సాయిసాకేత్‌కు రూ.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్ సాఫ్ట్‌వేర్ సంస్థలో కొలువు దక్కింది. అందులో భాగంగా పదివారాల పాటు ఇంటర్న్‌షిప్ కోసం అర్హత సాధించాడు. దీనికి రూ.కోటి వేతన చెల్లించనున్నారు. కోర్సు పూర్తి కాగానే ఏడాదికి రూ.5 కోట్లు ప్యాకేజీ ఇవ్వడానికి సదరు కంపెనీ ప్రాథమికంగా ఒప్పందం కుదుర్చుకుందని కుటుంబ సభ్యులు చెప్పారు.
గుంతకల్లుకు చెందిన రమేశ్, వాసవి దంపతుల కుమారుడు సాయి సాకేత్. వీరు పదేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. వీరి కుమారుడు అమెరికాలోనే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే కొలువకు అర్హత సాధించడం విశేషం. సంస్థ పెట్టిన ఎంపిక పరీక్షల్లో సాఫ్ట్‌వేర్, బిజినెస్, గణితం విభాగాల్లో అత్యంత ప్రతిభను చూపినందుకు సంస్థ ఎంపిక చేసిందని సాయి సాకేత్ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ