హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)
దక్షిణ కొరియాలోని గ్వాంగ్ జూ లో
జరుగుతున్న ప్రపంచ అర్చరీ చాంపియన్షిప్ లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం వివిధ కేటగిరిల్లో జరిగిన మ్యాచుల్లో విజయం సాధించి భారత ప్లేయర్లు చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. భారత పురుషుల కంపౌండ్ -రిషబ్ యాదవ్, అమన్ సైనీ, ప్రభత్మేష్ ఫుగే బృందం ఫ్రాన్స్ను 235 -233 తేడాతో ఓడించి భారత చరిత్రలోనే మొదటి గోల్డ్ మెడల్ ను దక్కించుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో స్కోర్లు 176-176తో సమంగా ఉన్నప్పటికీ చివరి రౌండ్లో భారత జట్టు 59-57 ఆధిక్యం సాధించి స్వర్ణ పతకాన్ని ఖాయంచేసింది. మరోవైపు మిక్స్ కంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ వేణ్ణం-రిషబ్ యాదవ్ జంట అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్కి చేరినా, నేదర్లాండ్స్ చేతిలో 155– 157 తేడాతో ఓడి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది. ఈ విజయాలతో భారత్ అర్చరీ చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..