అనంతనాగ్7 సెప్టెంబర్ (హి.స.) : శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్ మసీదు నవీకరణ పనుల అనంతరం వక్ఫ్‌బోర్డు ఏర్పాటు చేసిన ఫలకంపై జాతీయ చిహ్నాన్ని ఉపయోగించడాన్ని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం విమర్శించారు. జాతీయ చిహ్నాన్ని ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఉపయోగించాలే తప్ప మతసంస్థల కార్యకలాపాలకు కాదని ఆయన అన్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు జమ్మూకశ్మీర్ వక్ఫ్‌బోర్డు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. హజ్రత్‌బల్ ప్రార్థనా స్థలంలో జాతీయ చిహ్నమైన అశోకచక్రంతో కూడిన ఫలకాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం వివాదంగా మారిన నేపథ్యంలో ఒమర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మసీదులు, ఆలయాలు, గురుద్వారాలు ప్రభుత్వ సంస్థలు కావు, అవి మత స్థానాలు. మత సంస్థల్లో ప్రభుత్వ చిహ్నాలు ఏర్పాటు చేయరు, అని సీఎం అన్నారు. దేశంలోని మరెక్కడా కూడా మతపరమైన సంస్థల్లో ఇలా జాతీయ చిహ్నలను ఉపయోగించడంలేదని ఆయన పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ