దిల్లీ/ రాయ్‌పుర్: ,07 సెప్టెంబర్ (హి.స.వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని దేశం నుంచి తుడిచిపెట్టేయాలన్న లక్ష్య సాధనలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు మరింత ముమ్మరంగా చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా మావోయిస్టు అగ్రనేతల్ని మట్టుబెట్టేందుకు ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలకు చెందిన 30 కొత్త స్థావరాలు, ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో రాయ్‌పుర్‌లో శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో.. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్ని సమీక్షించడంతోపాటు బలగాల మోహరింపు, మరింత లోనికి చొచ్చుకుపోయే కొత్త యూనిట్ల అవసరం మొదలైన అంశాలపై చర్చ జరిగింది. వర్షాకాలం తర్వాత దాడుల్ని ముమ్మరం చేయాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు వివరించాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ