మెరుగైన ప్రతిపక్షం కోసం ప్రజా ఉద్యమం రావాలి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: ప్రతిపక్ష నేతలు జీఎస్టీపై ఏ మాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. మన దేశంలో మెరుగైన ప్రతిపక్షం, మెరుగైన ప్రతిపక్ష నేతల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చెట్ల నరికివేతకు
Nirmala Sitharaman


న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: ప్రతిపక్ష నేతలు జీఎస్టీపై ఏ మాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. మన దేశంలో మెరుగైన ప్రతిపక్షం, మెరుగైన ప్రతిపక్ష నేతల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు వచ్చిన తరహాలో దేశంలో మెరుగైన ప్రతిపక్షం, మెరుగైన ప్రతిపక్ష నేతల కోసం ఉద్యమం రావాల్సి ఉందని పేర్కొన్నారు. శనివారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలపై నిర్మల విమర్శలు గుప్పించారు. ‘‘జీఎస్టీ ప్రవేశపెట్టిన మొదట్లో 4శ్లాబులు పెట్టడం తప్పు అని, తాము చెప్పినట్టే ఇప్పుడు 2శ్లాబులకు తగ్గించారని కాంగ్రెస్‌ చెప్పడం తప్పు. జీఎస్టీ తేవడం, పన్ను శ్లాబుల నిర్ధారణ బీజేపీ ఒక్కదాని నిర్ణయం కాదు. అప్పటి కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడి సాధికార కమిటీ నిర్ణయం తీసుకున్నది అప్పటి పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అసిమ్‌ దాస్‌ గుప్తా అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి చర్చల్లోనే 4శ్లాబులను నిర్ణయించారు. ఇది ప్రతిపక్షాలకు తెలియదా? అవగాహన లేదా? ఒకవేళ మేం తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. కానీ ప్రతిపక్షాల ఆరోపణలన్నీ అవాస్తవం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande