విజయవాడ, 7 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం (Liquor scam) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయగా.. ఇందులో కీలక పాత్ర పోషించిన వారిని సిట్ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఈ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి సెప్టెంబర్ 6న ఏసీబీ కోర్టు (ACB Court) బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ రోజు ఉదయం నాటకీయ పరిణామాల మధ్య ముగ్గురు నిందితులు అయిన సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఏ31, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఏ 32, బాలాజీ గోవిందప్ప ఏ 33 ఈ రోజు ఉదయం విజయవాడ జైలు నుంచి విడుదల (Released from prison) అయ్యారు. అయితే వీరికి బెయిల్ ఇవ్వడం పై సిట్ అధికారులు మరికొద్ది సేపట్లో ఏసీబీ కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి