తిరుమల, 7 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. చంద్రగ్రహణం (Lunar Eclipse) కారణంగా మధ్యాహ్నం నుంతచి ఆలయ తలుపు మూతపడనుండగా.. టీటీడీ (TTD) తెల్లవారుజామునుంచే సర్వదర్శనం క్యూలైన్ ను క్లోజ్ చేసింది. ప్రస్తుతం క్యూలైన్లో ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. క్యూలైన్ ను తిరిగి రేపు తెల్లవారుజామున 2 గంటలకు తెరవనున్నట్లు పేర్కొంది.
నిన్న శ్రీవారిని 82,118 మంది భక్తులు దర్శించుకోగా.. 32,118 మంది స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి