ధర్మస్థలపై తప్పుడు ప్రచారం, డబ్బులు తీసుకుని యూట్యూబర్ల కథనాలు
న్యూఢిల్లీ,07,సెప్టెంబర్ (హి.స.) కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే హోరు. హిందువులకు ఎంతో పవిత్రమైన స్థలంలో వందలాది మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానని
Radhakrishnan


న్యూఢిల్లీ,07,సెప్టెంబర్ (హి.స.) కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే హోరు. హిందువులకు ఎంతో పవిత్రమైన స్థలంలో వందలాది మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానని అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ‘‘ధర్మస్థలం’’పై అనేక వీడియోలు చేశారు. వందలాది శవాలు దొరుకుతున్నాయని హోరెత్తించారు. చివరకు ఎవరైతే ఈ ఆరోపణలు చేశాడో, అవన్ని తప్పుడు ఆరోపణలే అని తేలింది.

అయితే, ఇప్పుడు ఓ యూట్యూబర్ చేసిన వాదన సంచలనంగా మారింది. ధర్మస్థలను అవమానపరిచేలా, ధర్మస్థలకు వ్యతిరేకంగా కంటెంట్ చేయడానికి అనేక మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు డబ్బు చెల్లించారని ఆ యూట్యూబర్ పేర్కొన్నారు. య్యూట్యూబ్‌లో ‘‘గోల్డెన్ కన్నడిగ’’ వ్లాగ్ ఛానెల్ నిర్వహిస్తున్న సుమంత్ గౌడ ఈ సంచలన ఆరోపణలు చేశారు. హిందువులకు ఎంతో పవిత్రమైన పట్టణమైన ‘‘ధర్మస్థల’’కు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాలని తనకు కూడా డబ్బులు ఆఫర్ చేసినట్లు పేర్కొన్నారు.

ధర్మస్థలపై కంటెంట్ చేయడానికి డబ్బు తీసుకున్న అనేక మంది యూట్యూబర్లతో తాను మాట్లాడానని సుమంత్ వెల్లడించారు. దీని వెనక ఎవరున్నారు.. ఎవరు నిధులు ఇచ్చారు అనే విషయాలను మనం కనుక్కోవాలి. వారు నాకు డబ్బులు ఆఫర్ చేశారు.’’ అని అన్నారు. తన తోటి యూట్యూబర్ కూడా అలాంటి కంటెంట్ చేసినందుకు డబ్బులు వస్తున్నాయిని చెప్పాడని, డజన్ల కొద్దీ కంటెంట్ క్రియేటర్లుఈ విషయాన్ని వైరల్ చేశారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande