హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.)
కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
ఇవాళ గాంధీ భవన్లో టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె.. టీపిసిసి అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మహేష్ కుమార్ గౌడ్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తాను పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. వచ్చే విస్తృత స్థాయి సమావేశాలు జిల్లాల్లో నిర్వహించేలా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు. ప్రతి కమిటీలో సోషల్ జస్టిస్కు అనుగుణంగా ఎంపిక ఉంటుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో 70 నుంచి 80 శాతం పాత వారికి పదవులు ఇచ్చామని, మిగిలిన 20 శాతం కొత్త వారికి అవకాశం కల్పించామని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు