అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.) ఆలిండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై ఏపీ సర్కారు కసరత్తు తుది దశకు చేరుకుంది. నిన్న సీఎస్, డీజీపీ, సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశారు. నేడు కూడా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బదిలీలపై చర్చించనున్నారు. జేసీల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీల వరకు మార్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఎస్పీల నుంచి DIG, IG వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారుల నియామకం జరిగే అవకాశం ప్రస్పుటంగా ఉంది.
ఈ క్రమంలోనే నేడు పలువురు ముఖ్య కార్యదర్శుల బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలుస్తోంది. ఈ సమూల మార్పులు ద్వారా పాలనలో వేగాన్ని పెంచాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఈ 15 నెలల కాలంలో అధికారుల పనితీరుపై స్పష్టమైన సమాచారం, అవగాహనతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టబోతోంది. బాగా పనిచేసిన అధికారులను ప్రోత్సహించేలా....ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని వారిని మార్చేలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి