పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది బీఆర్ఎస్సే.. కూనమనేని
వరంగల్, 8 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది బీఆర్ఎస్సేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం హనుమకొండలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ ఫ
కూనమనేని


వరంగల్, 8 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది బీఆర్ఎస్సేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం హనుమకొండలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం చట్టంలోనే మార్పులు అవసరమని సూచించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీబీఐపై నమ్మకం కోల్పోయిన పరిస్థితి నెలకొన్నదని, కేంద్రం ప్రభావం లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కమ్యూనిస్టులు నిస్వార్థ పరులు, ప్రజల గుండెల్లో నిలిచే త్యాగమూర్తులని పేర్కొన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల్లో ధనప్రవాహం, మతోన్మాద శక్తుల ఎదుట కూడా ప్రజల కోసం నిలబడి పోరాటం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం లోని సెక్యులర్, సోషలిజం పదాలను తొలగించే కుట్రలో ఉందని, ఈసీ, సీబీఐ వంటి సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని ఆరోపించారు. ఎర్రజెండా అంటే అలాంటి శక్తులకు భయమని, కమ్యూనిజాన్ని దేశం నుండి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కమ్యూనిస్టులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande