హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.)
మెరుగైన రోడ్లును నిర్మించి వాహనాలకు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రోడ్లు భవనాల శాఖామంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గంలో సుమారుగా రూ.300 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ రోడ్లు అభివృద్ధి పనులపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి వివరించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీసీఈ మోహన్ నాయక్, ఇతరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు