కర్నూలు, 8 సెప్టెంబర్ (హి.స.)దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది.
వైఎస్ఆర్ మనవడు, షర్మిల(YS Sharmila) తనయుడు రాజారెడ్డి(YS Rajareddy) రంగప్రవేశానికి రంగం సిద్ధమయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం షర్మిల కర్నూలు ఉల్లి మార్కెట్‌ను సందర్శించేందుకు వెళ్లారు. అయితే.. ఎన్నడూ లేనిది రాజకీయ పర్యటనలో షర్మిల వెంట రాజారెడ్డి రావడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. కర్నూలు పర్యటనకు వచ్చేముందు ఇంటి వద్ద అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబం నుంచి నలుగురు, అయిదుగురు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ సునీత సహా పలువురు ఇప్పటికే రాజకీయాల్లో ఉండగా.. తాజాగా రాజారెడ్డి ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి